
అమరావతి, 25 ఏప్రిల్ (హి.స)పోలవరం తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చాక మూడు దఫాలుగా దీపావళి, సంక్రాంతి, ఉగాది పర్వదినాల సమయంలో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారాన్ని జమచేసింది. ఈక్రమంలోనే.. ఏలూరు జిల్లా కేఆర్పురం ఫేజ్-1బీ పునరావాసం కింద భూపట్టాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించనున్నారు. మొత్తం 14 గ్రామాలకు చెందిన 1241 నిర్వాసిత కుటుంబాలకు రూ.85.03 కోట్లు ఆర్అండ్ఆర్ నగదు చెల్లింపులు, ఇంటి స్థల పట్టాలు అందజేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ