ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి, 25 ఏప్రిల్ (హి.స.) వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును శనివారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో పర్యటించారు. మార్కెట్ యార్డులో వలిగొండ, మల్లేపల్లి గ్రామాల ధాన్యం
Collector


యాదాద్రి భువనగిరి, 25 ఏప్రిల్ (హి.స.)

వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును శనివారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో పర్యటించారు. మార్కెట్ యార్డులో వలిగొండ, మల్లేపల్లి గ్రామాల ధాన్యం పోయడం జరుగుతుందని రైతులు తెలిపారు. టార్పాలిన్ కవర్ల సమస్యను పరిష్కరించాలని రైతులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని రైతులకు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్ కవర్లను అందించాలని ఆయన అధికారులకు సూచించారు.

అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్యుమరేటర్లతో మాట్లాడుతూ జన గణనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. స్వీయ గణనపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బీమా నాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారిని రోజా రమణి, తహసీల్దార్ దశరథ, మార్కెట్ సెక్రటరీ దివ్య, మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, ఆలకుంట శ్రీను, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande