కాంగ్రెస్ పార్టీతోనే రహదారుల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే వీరపల్లి
కాంగ్రెస్ పార్టీతోనే రహదారుల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే వీరపల్లి
Mla


షాద్నగర్, 25 ఏప్రిల్ (హి.స.) కాంగ్రెస్ పార్టీతోనే రహదారుల

అభివృద్ధి సాధ్యం అవుతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం నందిగామ మండలంలోని నందిగామ నుండి వీర్లపల్లి వెళ్లే రోడ్డులో లింగమూర్తుల వాగు వద్ద 3.50 లక్షలతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరై బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రహదారులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande