ప్రముఖ కథా.రచయిత కవి అనువాదకుడు లక్ష్మణ్ అయ్యర్ రామస్వామి కన్ను మూత
ప్రముఖ కథా.రచయిత కవి అనువాదకుడు లక్ష్మణ్ అయ్యర్ రామస్వామి కన్ను మూత
ప్రముఖ కథా.రచయిత కవి అనువాదకుడు లక్ష్మణ్ అయ్యర్ రామస్వామి కన్ను మూత


విశాఖపట్నం/ఎండాడ, :, 26 ఏప్రిల్ (హి.స.)

ప్రముఖ కథా రచయిత, కవి, అనువాదకుడు లక్ష్మణయ్యర్ రామస్వామి (ఎల్ఆర్ స్వామి) నగరంలోని విశాలాక్షినగర్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. డాక్టర్ స్వామి కేరళలోని త్రిచూర్ సమీపంలోగల బ్రాహ్మణ అగ్రహారంలో జన్మించారు. మలయాళం, తమిళ మాధ్యమాల్లో విద్యాభ్యాసం పూర్తిచేశాక, ముంబైలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ కంపెనీలో పనిచేశారు. తర్వాత విశాఖలోని ఆంధ్రా పెట్రో కెమికల్స్లో చేరారు. ఈ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ చేసి, విశాఖలోనే స్థిరపడ్డారు. చిన్నప్పుడు తండ్రి వద్ద సంస్కృతం, ముంబైలో హిందీ నేర్చుకున్న స్వామి, విశాఖలో తెలుగు భాషపై పట్టు సాధించారు. మలయాళం, తెలుగు భాషల్లో పలు రచనలు చేశారు. 1960 నుంచి 1970 వరకు మలయాళంలో విరివిగా కవితలు రాసి యువకవిగా గుర్తింపు పొందారు. విశాఖ వచ్చిన తరువాత తెలుగు నేర్చుకుని ‘జవాబులేని ప్రశ్న’ కథ రాశారు. తెలుగులో సుమారు 200 కథలు, 50 కవితలు రాశారు. 12 పుస్తకాలను మలయాళం నుంచి తెలుగులోకి, 13 పుస్తకాలను తెలుగు నుంచి మలయాళంలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ట్రస్టు నుండి పలు అవార్డులు సాధించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande