
ముంచంగిపుట్టు, 26 ఏప్రిల్ (హి.స.)
: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ సంఘం వలస గ్రామ సమీపంలో కాఫీ తోటల్లో నిల్వ ఉంచిన 749 కిలోల గంజాయిని ఎస్సై నాని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ