వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి.. దేవరకద్ర ఎమ్మెల్యే.
వడ్ల కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి.. దేవరకద్ర ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే


నల్గొండ, 26 ఏప్రిల్ (హి.స.)

వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు

ఈ పూర్తి చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఆదివారం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో వరి కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి కొనుగోళ్లకు సంబంధించి అవసరమైన కేంద్రాలతో పాటు, గన్ని బ్యాగులు, రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోని తమ వడ్లను అమ్మాలి అని సూచించారు.

వడ్లు తూకం అయిన 24 గంటలలోనే డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతాయన్నారు. సన్న వడ్లకు బోనస్ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జమ అవుతుంది అని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande