కల్వకుంట్ల ఫ్యామిలీ బ్రాంచ్ : కవిత కొత్త పార్టీపై రఘునందన్ రావు సెటైర్లు
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత ఒక కొత్త బ్రాంచ్ను ప్రారంభించారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఆమె పార్టీ జెండా రంగులను చూస్తుంటేనే
Mp


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనపై

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత ఒక కొత్త బ్రాంచ్ను ప్రారంభించారని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఆమె పార్టీ జెండా రంగులను చూస్తుంటేనే ಆಮ అనుసరిస్తున్న విధానం స్పష్టమవుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పసుపు రంగును, వైసీపీ నుంచి బ్లూ కలర్ ను, జనసేన పార్టీ పేరులోని 'సేన'ను కాపీ కొట్టారని విమర్శించారు. చివరకు తన తండ్రి స్థాపించిన టీఆర్ఎస్ నుంచి 'TR'ను కూడా తీసుకున్నారన్నారు.

కవిత తనను తాను తెలంగాణ 'అమ్మ'గా, జయలలిత స్థాయి నేతగా ఊహించుకుంటున్నారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. కేవలం ముఖ్యమంత్రి కావాలనే కలతోనే ఈ పార్టీని స్థాపించారని, ఈ పార్టీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (CEC) వద్ద నమోదైన 6201 పార్టీలలో අධි కూడా ఒకటిగా మిగిలిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఆత్మ చచ్చిపోయిందని కవిత వ్యాఖ్యానించడాన్ని రఘునందన్ రావు తప్పుబట్టారు. స్వయంగా తన కుమార్తె వేసిన ఈ ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో చూడాలన్నారు. కవిత వెనుక అదృష్ట హస్తం ఉందని, ఆ హస్తానికి సహాయపడటం తప్ప ఆమె చేసేదేమీ లేదని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande