
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
డీలిమిటేషన్ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. జీడీపీ లెక్క ప్రకారం సీట్లు పెంచితే కేవలం హైదరాబాద్లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని, చివరకు సీఎం పోటీ చేయడానికి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉండదన్నారు.
ఇవాళ హైదరాబాద్లో డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ స్థానంలో కూర్చోవాలని ఉబలాట పడుతున్నారన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం తీసుకువచ్చేలా దేశమంతా 50 శాతం సీట్లు పెంచుతామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. వీళ్లు అడ్డుకోకపోతే తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు 50 శాంత పెరిగేవన్నారు. రేవంత్ రెడ్డి ట్రాప్లో రాహుల్ గాంధీ పడుతున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..