బేగంపేట మహిళా కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు
బేగంపేట మహిళా కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు
Begumpet college


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)దేశంలోనే ఉత్తమ కళాశాలగా బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా బేగంపేట కళాశాలకు ఒకటో ర్యాంకును ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ కేటాయించింది. దిల్లీలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అప్పియా చిన్నమ్మ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా.అనీ శరన్కు ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు పురస్కారాన్ని ప్రదానం చేశారు. 4813 మంది విద్యార్థులు, 115 మంది బోధనా సిబ్బంది, 55 మంది బోధనేతర సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, మెరుగైన ఉత్తీర్ణతా శాతం, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పన, 72 విభిన్న కోర్సుల నిర్వహణ, సామాజిక సేవా కార్యక్రమాలు, స్వయం ప్రతిపత్తి వంటి అంశాల ప్రాతిపదికగా దేశంలోనే కళాశాలకు మొదటి ర్యాంకు కేటాయించినట్టు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ (సంస్కృత విభాగం) డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహం, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించగలిగామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande