
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన అనేది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల పంపిణీకి పునాది అని పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం, లక్షిత సంక్షేమ పథకాల రూపకల్పనలో.. దేశ పురోగతి అంచనాలో ఈ జనగణన కీలకమని ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్