
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
మంత్రులు, సీఎంల కాన్వాయ్లు వస్తుంటే ఆయా మార్గాల్లో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే సీఎం వస్తున్నాడన్న కారణంతో పదే పదే రోడ్లపై పడిగాపులు కాసేలా చేస్తే.. అది కూడా మండుటెండలో వాహనదారులను ట్రాఫిక్లో నిలిపేస్తే ఎలా ఉంటుంది. సీఎం రాకతో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని వాహనదారులు ఆగ్రహావేశాలను లోనయ్యారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వివాహాది కార్యక్రమాలకు వస్తున్నాడని గంటకు పైగా వాహనాలను నిలిపివేశారని ప్రజలు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై హారన్లు కొట్టి నిరసన తెలిపారు.
ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధి నిత్యం పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తుంటే పోలీసులు వాహనాలను గంటలు గంటలు ఆపుతున్నారని వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులలో బయటకు వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అంటూ అబద్ధపు ప్రకటనలు ఇస్తూనే.. మరోవైపు తరచూ ఇలా ట్రాఫిక్ను ఆగిపోయేలా చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నాడంటూ వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు