
కరీంనగర్, 26 ఏప్రిల్ (హి.స.) జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరు తమ వివరాలను స్వయంగా నమోదు( స్వీయ గణన) చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో చేపడుతున్న జన గణనలో భాగంగా స్వీయ గణన కార్యక్రమంపై ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వీయ గణన ప్రక్రియపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణనలో ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా ఫోన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇది సులభమైన సురక్షితమైన పారదర్శకమైన విధానమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్వీయ గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 15 రోజులపాటు కొనసాగుతుందన్నారు.. జనాభా గణనలో గృహముల నివాసయోగ్య స్థితి, వసతులు మతము, షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగలు, కుటుంబ యజమాని పేరు త్రాగునీటి వసతి గృహ వినియోగం ఇంధనం వంటి వివరాలతో కూడిన 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ దేశ ప్రగతి .అభివృద్ధికి సమాచారం దోహదపడుతుందన్నారు. వెబ్ పోర్టల్ అడ్రస్ se.censes.giv.ఇన్ ఈ పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి గృహాన్ని జియో ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. నమోదు పూర్తయిన తర్వాత హె చ్ తో
ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జనరేట్ అవుతుందన్నారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను సుమారు 15 నిమిషాల్లో నమోదు చేసి ఈ ప్రత్యేకమైన సెల్ఫ్ ఇన్వరేషన్ ఐడి పొందవచ్చన్నారు.
స్వీయ గణన నమోదు అనంతరం వచ్చిన ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ కు ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
గృహాల జాబితా లెక్కింపు సమయం ఎన్యుమరేటర్లు సూపర్వైజర్ల ద్వారా తమ తమ వివరాలను ధ్రువీకరిస్తారని తెలిపారు.
డిజిటల్ జనగణన ఆధునిక సాంకేతికతతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు అనుబంధ కార్యాలయాలు సంస్థల అధికారులు ఉద్యోగులు స్వీయ గణనలో పాల్గొనేలా ప్రజలు పౌరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు మెడికల్ సిబ్బంది క్రీడాకారులు కళాకారులు జనాభా గణన విధులు నిర్వర్తిస్తున్న అధికారులు బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అంగన్వాడీ ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రజలు స్వీయ గణనలో పాల్గొనేలా కృషి చేసేందుకు బాధ్యతాయుత అధికారులను నియమించామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..