
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 చొప్పున కుట్టు మిషన్లను కేటాయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం అమలు చేస్తోంది. కుట్టుపనిలో ఇప్పటికే నైపుణ్యం కలిగి ఉండి, సరైన యంత్రాలు లేక ఇబ్బంది పడుతున్న బీసీ మహిళలకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పించనుంది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ద్వారా పని వేగంగా, నాణ్యతగా జరుగుతుంది. సాధారణ మిషన్లతో పోలిస్తే వీటి ద్వారా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుపేద మహిళలు దర్జీలుగా మారి తమ కుటుంబాన్ని పోషించుకోగలరని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకానికి సంబంధించి అర్హతలు, వయసు పరిమితి, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. వార్షిక ఆదాయ పరిమితి వంటి నిబంధనలు ఉండే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్