హైదరాబాద్ కలెక్టర్గా ప్రియాంక అల
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రియాంక అల నియమితులయ్యారు.
Collector Hyderabad


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రియాంక అల నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2016బ్యాచ్కు చెందిన ప్రియాంక ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరిచందన కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

ఆరుగురు జోనల్ కమిషనర్ల బదిలీ... : తాజా బదిలీల్లో ఆరు జోన్ల కమిషనర్లను ప్రభుత్వం మార్చింది. కొత్తగా వస్తున్న వారి వివరాలు.. గోల్కొండ-పి.ఉదయ్కుమార్, ఖైరతాబాద్-బదావత్ సంతోష్, శేరిలింగంపల్లి-నారాయణ్ అమిత్, ఎల్బీనగర్-వికాస్ మహతో, కూకట్పల్లి-మయాంక్ సింగ్, రాజేంద్రనగర్- ఎస్.శ్రీనివాసరెడ్డి.లు జోనల్ కమిషనర్లుగా నియమితులయ్యారు

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande