ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం - తొలి మహిళా సీజేగా రికార్డు
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం - తొలి మహిళా సీజేగా రికార్డు
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం - తొలి మహిళా సీజేగా రికార్డు


అమరావతి 26 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం చేశారు. విజయవాడలోని లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లిసా గిల్తో సీజేగా ప్రమాణం చేయించారు. కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి జస్టిస్ లిసా గిల్ను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ గిల్ అతిథులను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి ఆమెను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ లిసా గిల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డుకెక్కారు. రాష్ట్ర హైకోర్టుకు ఆమె ఐదో ప్రధాన న్యాయమూర్తి.

తరలివచ్చిన కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు :

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, పంజాబ్-హరియాణా హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తరలివచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande