సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేసిన కేటీఆర్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
KTR


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ అమలు కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచాయని.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రేవంత్ నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని రేవంత్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని యాంకర్లు, యాక్టర్లు కూడా గుర్తుపట్టడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీలో కమల్ హాసన్ని మించిన నటులు ఉన్నారని కేటీఆర్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande