దక్షిణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ కు మరో ప్రతిష్టాత్మక.మైలు రాయి
దక్షిణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ కు మరో ప్రతిష్టాత్మక.మైలు రాయి
దక్షిణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ కు మరో ప్రతిష్టాత్మక.మైలు రాయి

అల్వాల్/విశాఖపట్నం, 26 ఏప్రిల్ (హి.స.)రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మరో ప్రతిష్ఠాత్మక మైలురాయిని అధిగమించింది. విశాఖపట్నం యూనిట్లో తయారు చేసిన వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడోను నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)కు అందజేసింది. బీడీఎల్, డెవల్పమెంట్-కమ్-ప్రొడక్షన్ పార్టనర్గా ఎన్ఎస్టీఎల్తో కలిసి తొలి స్వదేశీ ఉత్పత్తి స్థాయి వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో (డబ్ల్యూజీహెచ్డబ్ల్యూటీ)ను విజయవంతంగా రూపొందించింది. ఈ టార్పెడోను శిక్షణ, యుద్ధ వినియోగం అనే రెండు రకాలుగా అభివృద్ధి చేసి ఎన్ఎస్టీఎల్కు అప్పగించారు. దీంతో ఆత్మనిర్భర్ భారత్లో ఇది మరో పెద్ద విజయంగా నిలిచింది. దీనిలో అధునాతన హోమింగ్, ప్రొపల్షన్ వ్యవస్థలతో పాటు శత్రువుల నౌకలను శోధించడం, దాడి, తిరిగి దాడి సామర్థ్యం ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande