సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మహిళల మృతి
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఇద్దరు మహిళల మృతి
Road accident


సంగారెడ్డి, 26 ఏప్రిల్ (హి.స.)

సంగారెడ్డి జిల్లా సదాశివపేట

మండలం నంది కంది గ్రామం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 65 నెంబర్ జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. జహీరాబాద్ వద్ద దర్గాను దర్శించుకుని 300 హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్కల్ మండలానికి చెందిన లావణ్య, మనూరు మండలానికి చెందిన రుక్మిణి మరి కొందరితో కలిసి ఆటోలో జహీరాబాద్ సమీపంలోని ఓ దర్గా కు వెళ్లారు. అక్కడ పూజలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande