మహాబూబాబాద్ జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు.!
మహాబూబాబాద్ జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు.!
Si


మహబూబాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) జిల్లాలో పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మొత్తం 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ, కొత్త స్థానాల్లో పోస్టింగ్లు కల్పించారు. ఈ బదిలీలు పరిపాలన కారణాలతో తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలలో భాగంగా కురవి, మరిపెడ, దంతలపల్లి, గంగారం, చిన్నగూడూర్, నర్సింహులపేట, బయ్యారం వంటి పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్సైలు నియమితులయ్యారు.

ముఖ్యంగా కురవి, మరిపెడ, మహబూబాబాద్ రూరల్ వంటి కీలక స్టేషన్లలో ఎస్సై స్థాయి అధికారులను మార్చడం గమనార్హం. ఇక కొంతమంది అధికారులను సీసీఎస్, డీసీఆర్బీ వంటి విభాగాలకు బదిలీ చేయగా, మరికొందరిని వీఆర్ (వేటింగ్ రిజర్వ్)లో ఉంచారు. అదేవిధంగా డోర్నకల్, మహబూబాబాద్ టౌన్, తొర్రూర్ ప్రాంతాలకు SI-I, SI-II స్థాయిలో పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. సంబంధిత అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి, రిలీవింగ్, జాయినింగ్ వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande