
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి చేపట్టిన జనగణన రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచే ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా స్వీయగణన చేపడుతున్న అధికారులు ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ se.census.gov.in ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. స్వీయగణన తప్పనిసరి కాదని ఇదొక ఆప్షన్ మాత్రమే అని అధికారులు పేర్కొన్నారు. దేశంలో మొదటిసారి జరిగే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.
:16 ఏళ్ల తర్వాత దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జనగణన జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొదటి సారి జనాభా లెక్కల సేకరణను అధికారులు ప్రారంభించారు. 2 దశల్లో జరిగే జనగణనలోని మొదటి దశలోని స్వీయ ధ్రువీకరణ నేటి నుంచే ప్రారంభమైంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసం అధికారులు రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెల 10 వరకు జరిగే స్వీయ ధ్రువీకరణలో 33 ప్రశ్నలు ఉంటాయని జనగణన డైరెక్టర్ హోలికేరి తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తయిన తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు హౌస్ లీస్టింగ్ చేస్తారని వివరించారు. ఇందుకు 80 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరం ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా జనగణన-2027ను మదర్ ఆఫ్ ఆల్ సెన్సెగా ఆమె పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi