తిరుమల నారాయణగిరి అష్టలక్ష్మి మండపంలో శ్రీ.పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమల నారాయణగిరి అష్టలక్ష్మి మండపంలో శ్రీ.పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమల నారాయణగిరి అష్టలక్ష్మి మండపంలో శ్రీ.పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం


తిరుమల, 26 ఏప్రిల్ ( హిం.స,)

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో రంగురంగుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా అలంకరించిన దశావతార-అష్టలక్ష్మి మండపంలో శ్రీపద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రెండు టన్నుల పుష్పాలు, అరటన్ను పండ్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. మొదటి రోజు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. నిత్యనూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగింది. అనంతరం శ్రీస్వామివారికి కొలువు(ఆస్థానం) నిర్వహించారు. ఈ క్రతువులు పూర్తికాగానే స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వేడుక ముగిసింది.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande