
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను లార్సెన్ & టూబ్రో (L&T) సంస్థ నుంచి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30, 2026 నాటికి ఈ స్వాధీన ప్రక్రియ పూర్తి కానుండగా, మే 1 నుంచి మెట్రో సేవలు అధికారికంగా ప్రభుత్వ నిర్వహణలోకి వస్తాయి. ఈ భారీ ఒప్పందం విలువ సుమారు ₹15,000 కోట్లు కాగా, ఇందులో ₹13,615 కోట్ల రుణ భారాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి ప్రభుత్వం 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తీసుకుంటోంది. మెట్రో నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త బోర్డును ప్రకటించింది, దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. సేవలలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న 115 మంది కీలక ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగించనున్నారు. మెట్రో ఫేజ్-2 మరియు ఫేజ్-3 విస్తరణ ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ పద్ధతిలో ముందుకు వెళ్లడానికి ఈ స్వాధీనం ప్రభుత్వానికి ఎంతో కీలకం కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi