మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలి : అదనపు కలెక్టర్ బి. ఎస్. లత
మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలి : అదనపు కలెక్టర్ బి. ఎస్. లత
Collector


జగిత్యాల, 26 ఏప్రిల్ (హి.స.)

ధర్మం. అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ( Role Model ) నిలువాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్.లత (B.S. Latha) అన్నారు. వాసవీ మాత జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ( Vasavi Matha Jayanthi ) ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. .

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని పల్లకిని మోసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande