ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల ఆత్మగౌరవం : ఎమ్మెల్యే నాగరాజు
ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల ఆత్మగౌరవం : ఎమ్మెల్యే నాగరాజు
Mla


వరంగల్, 26 ఏప్రిల్ (హి.స.)

ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులైన బుర్ర సరిత, శ్రీనివాస్ దంపతులు, అలాగే బుర్ర కనకలక్ష్మి తమ నూతన ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం నిర్వహించగా, ఎమ్మెల్యే నాగరాజు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

పేదల సొంతింటి కలను సాకారం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande