పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్
పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్
Minister


నాగర్ కర్నూల్, 26 ఏప్రిల్ (హి.స.)

ఉప్పునుంతల మండలంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి డిండి కట్ట మైసమ్మ ఆలయం నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీ కృష్ణ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు ముఖ్య అతిథిగా పాల్గొని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా నూతన కమిటీ అధ్యక్షుడు ఎడ్ల నరేష్ యాదవ్ సభ్యులను జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మదన్, ఆలయ ఇంచార్జి ఈఓ శ్రీనివాసులు రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. డిండి కట్ట మైసమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధికి, బోటింగ్, రిసార్ట్ ఏర్పాటుకు రూ.10 కోట్ల నిధులతో త్వరలోనే ప్రారంభించినట్లు ఆయన హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించి మరో మైసిగండిలో తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరిక మేరకు నూతన కమిటీని నియమించామని తెలిపారు.

అనంతరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అన్ని వర్గాలకు సమాన న్యాయం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులను పరుగులు పెట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి నియోజకవర్గానికి ఉచితంగా వెయ్యి కుట్టు మిషన్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. డిండి కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ప్రత్యేక దీవెనలు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande