విజయనగరం జిల్లాలో డీజల్. పెట్రోల్ కొరత లేదు
విజయనగరం జిల్లాలో డీజల్. పెట్రోల్ కొరత లేదు
విజయనగరం జిల్లాలో డీజల్. పెట్రోల్ కొరత లేదు


విజయనగరం, 27 ఏప్రిల్ (హి.స.)

జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరతలేదని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వై కూడలి, జొన్నాడ వద్ద ఉన్న పెట్రోల్ బంకులను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల యజమానులతో మాట్లాడి నిల్వలను పరిశీలించారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని చెప్పారు. బ్లాక్ మార్కెట్లో వీటి విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందవలసినకానీ

అవసరం లేదని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande