
తిరుపతి, 27 ఏప్రిల్ (హి.స.)
: ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వేళ.. తిరుపతిలో వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. తిరుపతి తనపల్లి రోడ్డులో ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులకు బంకు యజమాని రాజేశ్రెడ్డి ఉచితంగా లీటర్ పెట్రోల్ పోస్తున్నారు. రొమ్మల రాజేశ్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పెట్రోల్ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పెట్రోల్పై భయాందోళనలు తగ్గేవరకు ఉచితంగానే పెట్రోల్ పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు బంక్కు క్యూ కట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ