భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ఏర్పాటు
విశాఖపట్నం, 27 ఏప్రిల్ (హి.స.) -: భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏర్పాటు చేయబోయే ‘వైజాగ్ మెగా డేటా పార్కు’కు 28న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శంకుస్థాపన అనంతరం ఐటీ రంగానికి సంబంధించి
భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలం తర్లువాడలో  గూగుల్ఏర్పాటు


విశాఖపట్నం, 27 ఏప్రిల్ (హి.స.)

-: భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏర్పాటు చేయబోయే ‘వైజాగ్ మెగా డేటా పార్కు’కు 28న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శంకుస్థాపన అనంతరం ఐటీ రంగానికి సంబంధించిన నిపుణులు, ప్రజాప్రతినిధులు, గూగుల్ భాగస్వాములుగా ఉన్న సంస్థల ప్రతినిధులతో నిర్వహించే సభ కోసం ప్రత్యేక టెంట్లతో వేదిక, హాలు ఏర్పాటు చేశారు. జాతీయరహదారి (ఎన్హెచ్16)పై గుడిలోవ అండర్ పాస్ నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతం వరకూ రూ.1.50కోట్లతో తాత్కాలిక రోడ్డు పూర్తి చేశారు. తర్లువాడ ప్రాంతం ఇప్పటికే పోలీసు నిఘాలో ఉంది. శంకుస్థాపన రోజు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నగరం నుంచి తర్లువాడకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

:ఏపీఐఐసీ ఇటీవల తర్లువాడలో కేటాయించిన భూములుకు సంబంధించి అలాట్మెంట్ లెటర్ ఇచ్చింది. ‘వైజాగ్ మెగా డేటా పార్కు లిమిటెడ్’ పేరుతో మౌలిక సదుపాయాల భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పర్యావరణ అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేసింది. సర్వే నెంబరు 1, 35, 71, 72, 73, 74, 75లోని మొత్తం 266.6 ఎకరాల్లో బిల్డింగ్ ప్లాన్ సమర్పించారు. ఇందులో 33శాతం పార్కింగ్కు, 59.91 ఎకరాల్లో గ్రీన్బెల్ట్ను 2మీటర్ల వెడల్పున ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ఉమ్మడి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటాసెంటర్ క్లస్టర్గా గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని డేటాసెంటర్లను ఆకర్షించేందుకు గూగుల్కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా కల్పించేందుకు చర్చలు జరుగుతున్నాయి. గూగుల్ డేటాసెంటర్ నిరంతరాయంగా నడపడానికి అవసరమైన విద్యుత్ను దేశం నలుమూలల నుంచి కొనుగోలు చేసి సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande