కోతుల బెడద నివారణకు పంచాయతీ సిబ్బంది వినూత్న ఆలోచన
కోతుల బెడద నివారణకు పంచాయతీ సిబ్బంది వినూత్న ఆలోచన
కోతుల బెడద నివారణకు  పంచాయతీ సిబ్బంది వినూత్న ఆలోచన


కూచిపూడి, 27 ఏప్రిల్ (హి.స.)

కోతుల బెడద నివారణకు కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి పంచాయతీ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో మూడేళ్లుగా కోతులు పంటలను నాశనం చేస్తూ, మనుషులను గాయపరుస్తూ, ఆస్తినష్టం కలిగిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పంచాయతీ కార్యదర్శి వీరాంజనేయులు ఆధ్వర్యంలో సిబ్బంది ఒకరికి గొరిల్లా వేషం వేయించి గ్రామంలో తిప్పుతున్నారు. కొండముచ్చును కూడా తెప్పించి కోతులు ఉన్న ప్రాంతంలో తిప్పడంతో అవి పొలాల నుంచి పరుగులు తీశాయి. ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వడంతో కోతుల బెడద తగ్గే వరకు ఇదే విధానాన్ని కొన సాగించాలని భావిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande