కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు
మదనపల్లి, 27 ఏప్రిల్ (హి.స.) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు మరియు గన్మెన్లు సిబ్బందిపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది.తిరుమల నుంచి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే వ
పుు


మదనపల్లి, 27 ఏప్రిల్ (హి.స.)

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు మరియు గన్మెన్లు సిబ్బందిపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది.తిరుమల నుంచి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని టోల్ ఫీజు కోసం సిబ్బంది నిలిపివేయడంతో వాగ్వాదం మొదలైంది. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతారా అంటూ ఆగ్రహించిన అనుచరులు, గన్మెన్లు దాడికి దిగారు.ఈ దాడిలో టోల్ ప్లాజా మేనేజర్ రవి మరియు మహిళా ఉద్యోగి శ్రీలత గాయపడ్డారు. మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని లాగి, విచక్షణా రహితంగా కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. మేనేజర్ను బలవంతంగా వాహనంలో లాక్కెళ్లి, ఆ తర్వాత వదిలిపెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా వదిలేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే, ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేయలేదని వాల్మీకిపురం పోలీసులు స్పష్టం చేశారు. అయితె ఘటనపై వాయల్పాడు పోలీసులు ఈ రోజ ఉదయం కేసు నమోదు చేశారు. టోల్ గేట్ మేనేజర్ రవి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ రోజు 9 గంటలకు ఎఫ్. ఐ.ఆర్ నమోదు అయ్యింది ౌటోల్ గేట్ మేనేజర్ రవి, మహిళ సిబ్బంది శ్రీలత పై దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టోల్ సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, సుమారు 10 నిమిషాలు వేచి ఉండేలా చేశారని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆరోపించారు. సిబ్బందే మొదట దాడికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande