కడప: పారిశుద్ధ్య అధికారులకు కమిషనర్ వార్నింగ్
కడప: పారిశుద్ధ్య అధికారులకు కమిషనర్ వార్నింగ్
కడప


కడప, 27 ఏప్రిల్ (హి.స.)కడప కమిషనర్ రాకేష్ చంద్ర సోమవారం నగరంలో మార్నింగ్ విజిట్ చేశారు. నేడు నిర్వహించిన మార్నింగ్ విజిట్లో భాగంగా నగరంలోని 33వ డివిజన్ మరియు 44వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ముఖ్యంగా నగర పారిశుద్ధ్య పరిస్థితులు, ఇంటింటికి చెత్త సేకరణ విధానం మరియు ప్రజల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా ఇంటింటికి చెత్త సేకరణ నిర్వహిస్తున్న క్లాప్ (CLAP) ఆటోల ద్వారా తడి చెత్త (వెట్ వెస్ట్) మరియు పొడి చెత్త (డ్రై వెస్ట్) వేరు చేయడం పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఇంటి వద్దే చెత్తను వర్గీకరించడం వల్ల మున్సిపల్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలు అవుతుందని ఆయన తెలిపారు.

కమిషనర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తడి చెత్తను వేరు చేయడం ద్వారా కంపోస్టింగ్ ప్రక్రియకు ఉపయోగపడుతుందని, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్ సులభమవుతుందని వివరించారు. ఈ విధానం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, ల్యాండ్ఫిల్కు వెళ్లే చెత్త పరిమాణం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా క్లాప్ ఆటోల పనితీరు, సమయపాలన, చెత్త సేకరణలో పాటించాల్సిన నిబంధనలు మరియు సిబ్బంది బాధ్యతలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంటి నుండి సరైన విధంగా చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సంబంధిత సానిటేషన్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలతో కూడా కమిషనర్ గారు ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande