ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
mla-paritala-sunitha-inspects-employment-guarantee-works-16677586


అనంతపురం, 27 ఏప్రిల్ (హి.స.)రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురం గ్రామ సమీపంలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ రోజు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల హాజరును ఆమె స్వయంగా నమోదు చేశారు.

ఈ పరిశీలన ద్వారా పనుల పురోగతిని, కూలీల పనితీరును ఆమె అంచనా వేశారు. ఈ పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేదో ఆమె సమీక్షించారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఉపాధి హామీ పథకం పాత్రను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మినీ అమృత సరోవర్ పథకం పనులు ఏ మేరకు జరిగాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి నిలువ కుంటలు వలన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. తద్వారా రైతులకు బోర్లులో పుష్కలంగా నీరు సమకూరుందన్నారు. జిల్లాలో మొక్కల ప్లాంటేషన్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

ఏపీడీ ఈ.రామరావు మాట్లాడుతూ.. మండలంలో ఐదు వేల మందికి ప్రతి రోజూ పని కల్పిస్తున్నామని, 50 ఫారం ఫాండ్స్ పనులు జరుగుతున్నాయన్నారు. పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా ఉదయం ఐదు గంటల నుంచి 11 గంటల వరకూ పని కల్పిస్తున్నట్టుఎమ్మెల్యే పరిటాల సునీతకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande