
తిరుమల, 27 ఏప్రిల్ (హి.స.)
తిరుమలలో ఇంధన కొరత లేదని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
నిన్న మధ్యాహ్నం తిరుమలలోని హెచ్.పి, మరియు ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో మధ్యాహ్నం సదరు బంకుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టడం జరిగింది. అయితే సాయంత్రానికే హెచ్.పి.పెట్రోల్ బంక్ కు ట్యాంకర్ చేరుకోవడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. దాంతో ఈరోజు ఉదయానికే ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కు కూడా ట్యాంకర్ చేరుకుంది. అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను కోరడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV