విశాఖకు గూగుల్ రాక ఏపీ గేమ్.చేంజర్
విశాఖకు గూగుల్ రాక ఏపీ .గేమ్.చేంజర్
విశాఖకు గూగుల్ రాక  ఏపీ గేమ్.చేంజర్


విశాఖపట్నం,, 28 ఏప్రిల్ (హి.స.)ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. ఈరోజు(మంగళవారం) ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. విశాఖకు గూగుల్ రాక ఏపీకే గేమ్ఛేంజర్ అని అభివర్ణించారు. ఈరోజు (మంగళవారం) తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్కు సీఎం భూమిపూజ చేశారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు.

విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్టెల్ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.

గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖకు అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తెలిపారు. 2028 చివరినాటికి ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ సిటీగా విశాఖ ఉంటుందని.. మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లి కాబోతుందని తెలిపారు. టెక్నాలజీలో దేశానికే గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉందని వెల్లడించారు. పెట్టుబడిదారులే ఏపీకి భాగస్వాములని చెప్పారు. ఒప్పందాలే కాదని.. గ్రౌండింగ్ కూడా తమదే బాధ్యత అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande