ఏపి లోని.పలు జిల్లాలో పెట్రోల్ డీజల్ కొరత.సాగుతోంది
ఏపి లోని.పలు జిల్లాలో పెట్రోల్ డీజల్ కొరత.సాగుతోంది
ఏపి లోని.పలు  జిల్లాలో పెట్రోల్ డీజల్ కొరత.సాగుతోంది


రొంపిచర్ల, 28 ఏప్రిల్ (హి.స.)

ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నిబంధనలు పాటించని మూడు పెట్రోల్ బంకుల్ని కలెక్టర్ కృతికా శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande