అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
1 st high speed train


గుంతకల్లు(అనంతపురం), 29 ఏప్రిల్ (హి.స.): ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా తిరుపతి-అకోలా మధ్య రెగ్యులర్ బేసిస్పై వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అకోలా-తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ (17430) మే 3వ తేదీ నుంచి శుక్రవారాలలో ఉదయం 9-15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నరకు తిరుపతికి చేరుతుందన్నారు.

దీని తిరుగు ప్రయాణపు రైలు (17429) మే 8వ తేదీ నుంచి ఆదివారాలలో మధ్యాహ్నం 12-25 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు అకోలాకు చేరుతుందన్నారు. తిరుపతి వెళ్లాలనుకునే ప్రయాణీకులు ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande