చెన్నకేశవ స్వామి వ్రత మండపం ప్రారంభించిన మంత్రి
చెన్నకేశవ స్వామి వ్రత మండపం ప్రారంభించిన మంత్రి
minister-inaugurates-chennakesava-swamy-vrata-mandapam-1


ధర్మవరం, 29 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వ్రత మండపాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వామివారికి వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గంలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో పేదలకు వైద్యంతో పాటు, వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత లోపించిందని సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో కలసి మంత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రుల్లో 48 శాతం అధ్యాపకుల కొరత ఉందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రూ. 7000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిందని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande