కల్మా చదవమన్నాడు.. సెక్యూర్టీ గార్డులను కత్తితో పొడిచాడు.. ముంబైలో దారుణం
కల్మా చదవమన్నాడు.. సెక్యూర్టీ గార్డులను కత్తితో పొడిచాడు.. ముంబైలో దారుణం
కల్మా చదవమన్నాడు.. సెక్యూర్టీ గార్డులను కత్తితో పొడిచాడు.. ముంబైలో దారుణం


ముంబై: , 28 ఏప్రిల్ (హి.స.)ముంబై(Mumbai)లో ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఇద్దరు సెక్యూర్టీ గార్డులను పొడిచాడు. వారి మతం అడిగి మరీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నయా నగర్లో జరిగింది. దీనికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని 31 ఏళ్ల జైయిబ్ జుబీర్ అన్సారీగా గుర్తించారు. అయితే దాడికి ముందు అతను బాధితులను ఇస్లాం ప్రవచనం కల్మా చదవాలని బెదిరించినట్లు తెలిసింది. రాజ్కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ .. వాక్హార్డ్ ఆస్పత్రి వద్ద ఓ బిల్డింగ్లో గార్డులుగా పనిచేస్తున్నారు. అయితే వారికి వద్దకు వెళ్లిన అన్సారీ అటాక్ చేశాడు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. బాధితులు ఇద్దరూ ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. .

అటాక్ జరిగిన 90 నిమిషాల తర్వాత అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫూటేజ్ను స్కాన్ చేసి నిందితుడిని పట్టుకున్నారు.. థానే కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టారు. మే 4వ తేదీ వరకు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

దాడి పట్ల పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు అని పోలీసులు ప్రకటించారు. నిందితుడు అన్సారీకి చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైస్లను సీజ్ చేశారు. ఐసిస్, లోన్ వూల్ఫ్, జిహాద్, గాజా అన్న పదాలు అతని మొబైల్లో రాసి ఉన్నట్లు గుర్తించారు. గతంలో అమెరికాలో అతను నివసించాడు. అన్సారీ కుటుంబం ఇంకా అమెరికాలోనే ఉంటున్నది. అయితే అక్కడ అతనికి జాబ్ దొరకలేదు. దీంతో అతను ఇండియాకు రిటర్న్ వచ్చేశాడు. మీరా రోడ్డు ఏరియాలో అతను ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆన్లైన్లో కెమిస్ట్రీ పాఠాలు బోధిస్తూ సంపాదిస్తున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande