
హైదరాబాద్, 28 ఏప్రిల్ (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మహిళలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించిన పాపానికి ఇప్పుడు ప్రధాని మోదీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం వచ్చిందని పేర్కంది. లోక్సభలో ప్రస్తుత సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేసే విధానంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు
'నారీ శక్తి వందన్ అధినియం- 2023 అమలుపై స్పష్టత తీసుకురావాలి. ఈ చట్టం 2026 ఏప్రిల్ 16 రాత్రి ఆలస్యంగా నోటిఫై చేశారు. 2029 నుంచి ప్రస్తుత లోక్సభ 543 సీట్లతోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం, అవసరం, తప్పనిసరి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ అసలు లక్ష్యం కాదు. డిలిమిటేషన్ ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడమే ప్రధాన ఉద్దేశం. ప్రధాని రాజకీయ రక్షణ కోసం డిలిమిటేషన్ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. మహిళలను రాజకీయ అజెండా కోసం వినియోగించిన తప్పును సరిదిద్దుకుని, వారికి న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది' అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi