
కర్నూలు, 28 ఏప్రిల్ (హి.స.)కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, చేపట్టిన రీ-సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.
ఈ రోజు మంగళవారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ దశ రీ-సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న పనులను పరిశీలించి, పొలం సరిహద్దుల నిర్ధారణ, భూమి రికార్డుల సమీక్ష, రోవర్ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ, ఈ నెల 30 వ తేదీన పర్ల వద్ద హెచ్ పీసీఎల్ (HPCL) LPG పైప్ లైన్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఆర్డీవో ఇన్సిడెంట్ కమాండర్ గా వ్యవహరిస్తారన్నారు. ప్రమాదం జరిగినటపుడు ఏమేమి చర్యలు తీసుకుంటామో, ఆ విధంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV