భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల


తిరుమల., 28 ఏప్రిల్ (హి.స.)

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala)కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ రావడంతో కొండపై భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ దృష్ట్యా, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (SSD) కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. సోమవారం స్వామివారిని 74,286 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,186 మంది భక్తులు మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande