
అమరావతి, 29 ఏప్రిల్ (హి.స.
వన్టౌన్, : విశాఖ జిల్లా వ్యాప్తంగా హెచ్పీ, బీపీ, ఐఓసీలకు చెందిన 120 బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్కిశోర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో ఇంధన సరఫరా సాధారణంగా జరుగు తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత ఉందన్న ప్రచారాల నేపథ్యంలో పలువురు వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల కొన్ని బంకుల వద్ద తాత్కాలిక రద్దీ ఏర్పడిందన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలను నల్లబజార్కు తరలించకుండా చమురు సంస్థల సేల్స్ అధికారులతో పాటు, డీలర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు శాఖల అధికారులు, సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న బంకుల వద్ద నిఘా ఉంచామన్నారు.
ప్రస్తుతం 120 బంకుల్లో కలిపి 2,200 కిలో లీటర్ల పెట్రోలు, 2,677 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఇంధన విక్రయాలు, సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులు, నల్లబజార్కు తరలింపు వంటి అంశాలపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి (0891-2590100, 0891-2590102) తెలియజేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ