కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల.పరిధిలోని అలుగునుర్ వంతెన పై అర్దరాతి.రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల.పరిధిలోని అలుగునుర్ వంతెన పై అర్దరాతి.రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల.పరిధిలోని అలుగునుర్ వంతెన పై అర్దరాతి.రోడ్డు ప్రమాదం


తిమ్మాపూర్, 30 ఏప్రిల్ (హి.స.)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూర్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని టాటాఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్కు చెందిన 12 మంది వలస కార్మికులు కటికేనపల్లి వద్ద నివాసముంటూ హమాలీపనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం కూలిపనుల కోసం గజ్వేల్కి వెళ్లారు. పనులు ముగించుకొని బుధవారం అర్ధరాత్రి తిరిగి కటికేనపల్లికి వస్తుండగా.. అలుగునూర్ వంతెన వద్దకు రాగానే టాటాఏస్ వాహనం అతివేగంగా ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో 12 మంది ఉన్నారు. వారిలో ఒకరు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో ఇరుక్కున్న మృత దేహాన్ని అరగంట పాటు శ్రమించి బయటకు తీసినట్టు ఎల్ఎండీ ఎస్సై సయ్యద్ అన్వార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande