ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లో చేపట్టాలి.. సీఎం చంద్రబాబు
ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లో చేపట్టాలి.. సీఎం చంద్రబాబు
chandra babu


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

ఈఏడాది డిసెంబరు నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రియల్టైమ్ గవర్నెన్స్పై అధికారులతో సీఎం సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలూ తీసుకొస్తే ప్రజలకు ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు 1035 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోనికి తీసుకురావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేని పాలనను అందించవచ్చన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 54 లక్షల మందికి 1.75 కోట్ల సేవలను అందించామని అధికారులు వివరించగా.. ప్రజలకు ఈ సేవలపై అవగాహన కలిగించడం ద్వారా మరింత విస్తృతపరాలని సీఎం సూచించారు. ఇప్పటివరకూ 24 లక్షల మందికిపైగా వాట్సాప్, మనమిత్ర యాప్ ద్వారా సేవలందించామని అధికారులు తెలపగా.. వాట్సాప్, మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు పొందటంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్సిటీ ఏర్పాటు తొలిదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే డ్రోన్ సిటీలో కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఎనిమిది కంపెనీలకు భూ కేటాయింపులు జరిపామన్నారు. డ్రోన్సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారైందని వివరించారు. దీంతో ఈ ఏడాది జూలై నాటికి డ్రోన్ సిటీ మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande