హజ్ యాత్రకు బయలుదేరిన 117 యాత్రికులకు సకాలం లో లగేజి చేర్చ నందుకు నష్టపరిహారం
హజ్ యాత్రకు బయలుదేరిన 117 యాత్రికులకు సకాలం లో లగేజి చేర్చ నందుకు నష్టపరిహారం
హజ్ యాత్రకు బయలుదేరిన 117 యాత్రికులకు సకాలం లో లగేజి  చేర్చ నందుకు నష్టపరిహారం


అమరావతి, 30 ఏప్రిల్ (హి.స.)

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్రకు బయలుదేరిన 177 మంది యాత్రికులకు సకాలంలో లగేజీ చేర్చనందుకు సంబంధిత విమానయాన సంస్థ ఫ్లైఏడీల్ నష్టపరిహారం చెల్లించింది. 177 మంది హజ్ యాత్రికుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.13,800 చొప్పున మొత్తం రూ.24 లక్షల 42 వేల 600లను వారి అకౌంట్లలో జమ చేసింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న 177 మంది హజ్ యాత్రికులు గన్నవరం విమానాశ్రయం నుంచి మదీనా వెళ్లారన్నారు. వీరికి సంబంధించిన లగేజీని మదీనాలో దిగే సమయానికి చేరవేయలేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. సమస్యను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు, కేంద్ర హజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. వారి తక్షణ స్పందనతో విమానయాన సంస్థ పరిహారం విడుదల చేసిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande