ఏపీలో పెట్రోల్ డీజల్ సరఫరా మరింత మెరుగుపడింది
ఏపీలో పెట్రోల్ డీజల్ సరఫరా మరింత మెరుగుపడింది
petrol


విజయవాడ, 29 ఏప్రిల్ (హి.స.)

ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరా మరింత మెరుగుపడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. 4,345 బంకుల్లో 47 మినహా అన్నింటా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. కంపెనీల నుంచి బంకులకు 3,714 కిలోలీటర్ల పెట్రోల్, 7,107 కిలోలీటర్ల డీజిల్ను పంపారు. బంకుల ద్వారా ఈ రోజు వినియోగదారులకు 1,168 కిలోలీటర్ల పెట్రోల్, 2,086 కిలోలీటర్ల డీజిల్ పంపిణీ చేశారు. మూడు జిల్లాల్లో మాత్రమే పదికిపైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి, కడప, తిరుపతి జిల్లాల్లో మూతపడిన బంకులకు స్టాక్ సరఫరా కోసం అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ, అనకాపల్లి, పోలవరం, గుంటూరు జిల్లాల్లోని అన్ని బంకుల్లో స్టాక్ ఉంది. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి, రెండు బంకుల్లో మాత్రమే నోస్టాక్ అని కనిపిస్తున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande