రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే
రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే
Mla


భూపాలపల్లి, 29 ఏప్రిల్ (హి.స.)

రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలంలోని మోరంచపల్లి గ్రామంలో, అలాగే గణపురం మండలంలోని కర్కపల్లి, గాంధీనగర్, మైలారం గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర రూ.2,389తో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు కోత మిషన్ల ఆర్పీఎం 18 నుంచి 20 వరకు ఉంచి, బ్లోయర్ను ఆన్లో విధంగా మిషన్ యజమానులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. మాట్లాడుతూ రైతులు ఉంచే

ఇలా చేయడం వల్ల ధాన్యంలో తాలు ఉండదని వివరించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని, రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande