ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: మహేశ్ కుమార్
దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Mahesh Kumar


హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం నిజామాబాద్లో నూతన కాంగ్రెస్ కార్యాలయ భవనానికి మహేశ్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రధాని పదవిని కూడా రాహుల్ గాంధీ త్యాగం చేశారని.. దేశం మొత్తం ఆయనవైపు చూస్తోందన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ.. కుల, మతాల చిచ్చు రేపుతోందని మహేశ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు రావటం ఖాయమన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణను 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని మహేశ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో పార్టీ పోటీ లేదన్నారు. మంచి నమూనాతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని.. ఏడాది కాలంలో 4 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చామని మంత్రి సీతక్క వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande