రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. అడిషనల్ కలెక్టర్
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. అడిషనల్ కలెక్టర్
అడిషనల్ కలెక్టర్


మెదక్, 29 ఏప్రిల్ (హి.స.)

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బుధవారం వారు జిల్లాలోని నిజాంపేట గ్రామమునందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం 2027 తొలి విడత జన గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తప్పులు లేకుండా జనగణన నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోదని సూచించారు. తహశీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ రమ్య శ్రీ, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande