టీఆర్ఎస్ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి
కవిత పార్టీ పెట్టడం.. అది కూడా టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు.
Komatireddy


హైదరాబాద్, 29 ఏప్రిల్ (హి.స.)టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత పార్టీ పెట్టడం.. అది కూడా టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని.. కానీ కవిత తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్ను తిట్టడం తనకు బాధేసిందని తెలిపారు. తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తన అన్న మీద ఉన్న కోపాన్ని తండ్రి మీద చూపడం తప్పన్నారు. మద్యం కుంభకోణంలో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని.. కేసు పూర్తి కాలేదని ఎమ్మెల్యే తెలిపారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడమంటే పాన్ షాప్ పెట్టేంత సులువైందన్నారు.

మంత్రి పదవిపై అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని... మాట నిలబెట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. మంత్రి పదవి ఇస్తే మరింత కష్టపడి పనిచేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande